కళ్యాణదుర్గం మండలం నారాయణపురం పంచాయతీ పరిధిలోని గాజులపల్లి వెళ్లే రహదారి ఇరువైపులా కంపచెట్లను జేసీబీ సాయంతో సోమవారం తొలగించారు. టీడీపీ, జనసేన నాయకులు రమేశ్, భీమలింగ మాట్లాడుతూ గాజులపల్లి రోడ్డులో కంపచెట్ల సమస్యను ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు విన్నవించగా స్పందించి జేసీబీని పంపారని తెలిపారు. సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.