కళ్యాణదుర్గం: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు విద్యార్థి ఎంపిక

84చూసినవారు
కళ్యాణదుర్గం: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు విద్యార్థి ఎంపిక
కళ్యాణదుర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఉదయ్ కుమార్ రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ కు ఎంపికయ్యాడని ఫిజికల్ డైరెక్టర్ చల్లా కిరణ్ చౌదరి తెలియజేశారు. పట్టణంలోని ఆర్డీటీ హాకీ స్టేడియంలో నిర్వహించిన సెలక్షన్లలో విద్యార్థి ప్రతిభను గుర్తించి జిల్లా జట్టుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. నవరంబర్ 2 నుంచి నెల్లూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్