కంబదూరు తహశీల్దారు కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి కార్యాలయం పైకప్పు భాగం నుంచి లోపలికి వర్షపు నీరు చేరింది. కార్యాలయం మొత్తం వర్షపు నీరు నిండటంతో చిత్తడిగా మారిందని సిబ్బంది గురువారం విలేఖరులకు తెలిపారు. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన భవనం నిర్మించాలని సిబ్బంది కోరారు.