కళ్యాణదుర్గంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని గర్భవతిని చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని సోమవారం కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద బాధిత మహిళ, ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన సాయి తేజ పై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత మహిళ బంధువులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.