కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన విశ్రాంతి ఉద్యోగి వీరన్న, అతని తమ్ముడు చిక్కీరప్ప వ్యక్తిగత పనుల నిమిత్తం వాహనంలో పావగడ వైపుకు వెళ్తుండగా కెంచమ్మనహళ్లి గేట్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం పావగడ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.