కళ్యాణదుర్గం: డ్రైనేజీ కాలువ నిర్మాణానికి పనులు ప్రారంభం
కళ్యాణదుర్గం పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరణ చేయడంలో భాగంగా ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పాత బస్టాండ్ వద్ద డ్రైనేజీ ముఖ్య కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా రాత్రి సమయంలో పనులను చేపట్టారు. ప్రధాన కూడలి టీ సర్కిల్, గాంధీ సర్కిల్ ప్రాంతంలో రోడ్లపైనే మురికి నీటి నివారణకు చర్యలు తీసుకున్నారు.