శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు శనివారం శ్రీవారి దర్శనార్థం తిరుమల తిరుపతికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన శ్రీవారి దర్శనార్థం మెట్ల నుండి కాలు నడకన నడిచి వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి వెంకటప్ప, దరూర్ ఓబుల నాయుడు, నాగరాజు, ఆది నరసింహులు, శ్రీనివాసులు, గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు.