శ్రీసత్యసాయి జిల్లా, సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని గురువారం బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవితమ్మ సందర్శించారు. ఈ సందర్బంగా దేవాలయ కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.