హోం మంత్రి అమిత్ షా తన పదవికి అనర్హుడని వెంటనే రాజీనామా చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ, జిల్లా అధ్యక్షులు హనుమయ్య పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండ పట్టణంలోని హిందూపురం ఎంపీ బి. కె. పార్థసారథి కార్యాలయం వద్ద ఎంపీ అల్లుడు శశిభూషణ్ కి కెవిపిఎస్, ఎంఆర్పిఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ను అవమానపరిచిన హోం మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.