బుక్కపట్నం మండల కేంద్రంలోని యువత వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం నాడు టోర్నమెంట్ నిర్వహించడానికి ఆర్థిక సహాయం అవసరమని టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణకి తెలిపారు. ఆయన వెంటనే స్పందించి 20 వేల రూపాయలు ఆర్థికంగా సహాయం అందించారు. సందర్భంగా టోర్నమెంట్ యువత సామకోటి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సామకోటి ఈశ్వరయ్య, బండి మంజునాథ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.