కొత్త చెరువు మండలంలోని చెన్నకేశవపురంలో ఆదివార ఉచిత సామూహిక వివాహ మహోత్సవ కార్యక్రమం జరిగింది. లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో 24 జంటలకు ఉచిత సామూహిక వివాహ మహోత్సవాన్ని సాయి కృష్ణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.