రాయదుర్గం: మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

68చూసినవారు
రాయదుర్గం పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వర్షపు నీరు చేరి గుంతల మయంగా మారడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ గుంతలో ఇరుక్కుపోయి బోల్తా పడింది. గుమ్మఘట్ట మండలం తాళ్లకేర నుండి మొక్కజొన్నను ట్రాక్టర్ లో ఉడేగోళం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొక్కజొన్న నీటిలో తడిచిపోయి భారీ నష్టం జరిగినట్లు రైతు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్