రాయదుర్గం: కుంగిన రోడ్డు.. ప్రయాణికుల ఇక్కట్లు

77చూసినవారు
రాయదుర్గం మండలం దొడగట్ట, బాదనహాల్ గ్రామాలలో గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షానికి రోడ్డు కృంగిపోయింది. గ్రామాల ప్రజలు శనివారం విలేఖరులతో మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో దొడగట్ట, బాదనహాల్ గ్రామాల మధ్య రోడ్డు కృంగిపోయి గోతులు ఏర్పడడంతో అటుగా వాహనదారులు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్