యల్లనూరు మండలంలో నాకబంది
అనంతపురం జిల్లా ఎస్పి జగదీష్ డి. ఎస్. పి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పుట్లూరు సిఐ సత్యబాబు యల్లనూరు ఎస్ఐ రాంప్రసాద్ తమ సిబ్బందితో యల్లనూరు మండలం ఫ్యాక్షన్ గ్రామమైన గొడ్డుమారిలో నాకబంది నిర్వహించారు. రౌడీ షీటర్లు ట్రబుల్ మాంగర్స్ ఇళ్లలో, గడ్డివాములలో సోదాలు నిర్వహించారు. అనంతరం గ్రామసభ ఏర్పాటు చేసి ఎటువంటి గొడవలకు పాల్పడకూడదన్నారు. గొడవలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.