పుట్లూరు మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవోగా నరేంద్ర శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. తాడిపత్రి మండలంలో ఏపీడీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర బదిలీపై పుట్లూరు మండలానికి వచ్చారు. పుట్లూరులో విధులు నిర్వహిస్తున్న చెన్నకేశవులు ఏపీడీగా పదోన్నతిపై అనంతపురం రూరల్ కి వెళ్లినట్లు తెలిపారు.