తాడిపత్రిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ సీజ్

74చూసినవారు
తాడిపత్రిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ సీజ్
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ను తాడిపత్రి అర్బన్ పోలీసులు శుక్రవారం సీజ్ చేశారు. పట్టణంలోని నూతన పెన్నా బ్రిడ్జి వద్ద నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను ఆపి పోలీసులు తనిఖీ చేశారు. ఎటువంటి అనుమతి లేకపోవడంతో డ్రైవర్ కడవల రవీంద్రను అదుపులోకి తీసుకుని, ట్రాక్టర్ సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ సాయి ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్