పెద్దవడుగూరు మండలంలోని పి. వీరన్నపల్లిలో రైతు రెడ్డప్పరెడ్డి పొలంలో 150 మామిడి చెట్ల నరికివేత కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ చిన్న రెడ్డప్ప ఆదివారం తెలిపారు. ఫిర్యాదు మేరకు గోపాల్, శ్రీనివాసులు, రాఘవేంద్ర, వెంకటస్వామి, నాగభూషణను ఆదివారం అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్ ఐ చిన్న రెడ్డప్ప తెలిపారు.