పోలీస్ నిబంధనలు పాటించాలి: సీఐ

73చూసినవారు
పోలీస్ నిబంధనలు పాటించాలి: సీఐ
యాడికి మండల వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునే వారు పోలీసు నియమావళిని తప్పని సరిగా పాటించాలని సీఐ ఈరన్న తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీస్ స్టేషన్ లో గురువారం సమావేశం నిర్వహించారు. విగ్రహాలు పెట్టిన చోట డీజేకు అనుమతి లేదన్నారు. మండల వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఏర్పాటుకు అనుమతి ఉందన్నారు. పండగ నుంచి నిమజ్జనం వరకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కమిటీ సభ్యులే బాధ్యత వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్