పెద్దపప్పూరు మండలంలోని తిమ్మనచెరువులో వెలసిన ఎర్రమల లక్ష్మీకంభగిరి స్వామికి శనివారం నిర్వాహకులు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాలనుంచి విచ్చేసిన భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్ర, శనివారాలలో స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తుంటారని స్థానికులు తెలిపారు.