జిల్లా స్థాయి పోటీలకు యాడికి విద్యార్థులు

69చూసినవారు
జిల్లా స్థాయి పోటీలకు యాడికి విద్యార్థులు
యాడికిలోని విజన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ విశ్వనాథ్ తెలిపారు. అండర్-17 విభాగంలో కె. జ్యోతి బ్యాడ్మింటన్ లో తాలూకా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. బ్యాడ్మింటన్ బాలుర విభాగంలో మహమ్మద్, రుత్విక్ అండర్-17 విభాగంలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 విభాగం వాలీబాల్ పోటీల్లో త్రిషిత, రాజవర్దన్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికకావడం యాడికి మండలం గర్వించతగ్గ విషయమని పాఠశాల కరస్పాండెంట్ విశ్వనాథ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్