ఏవైనా సమస్యలు తెలియజేస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాగితోటపాళెంలోని పలు వీధుల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటి వెళ్లి ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తెదేపా నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.