యాడికి: అదానీ సిమెంట్‌ ఫ్యాక్టరీలో ప్రమాదం

56చూసినవారు
యాడికి మండలం బోయరెడ్డిపల్లె వద్ద ఉన్న అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద అగ్ని బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది. రామిల్లు వద్ద ఉన్న కిలన్ నుండి వచ్చిన అగ్ని రవ్వలు ఎగిసిపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న శివ కేశవ అక్కడికక్కడే మృతి చెందగా షణ్ముఖ రెడ్డి, దీపక్ సింగ్, ధన్వార్ సింగ్, కంబగిరి స్వామి లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

సంబంధిత పోస్ట్