
తాడిపత్రిలో నేడు కౌన్సిల్ సమావేశం
తాడిపత్రి మునిసిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశామని కమిషనర్ శివరామకృష్ణ తెలిపారు. మునిసిపల్ కార్యాలయంలో ఉదయం 11. 30 గంటలకు జరుగనున్న సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, కో-అప్షన్ మెంబర్లు, వివిధ శాఖ అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు.