తాడిపత్రి: శ్రీ చింతల వెంకటరమణస్వామిని దర్శించుకున్న జేసీ
తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బుధవారం పర్యటించారు. పట్టణ పరిధిలోని అతి పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. శ్రీ చింతల వెంకటరమణ స్వామి, శ్రీ ఆనందవల్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించారు.