ఉరవకొండ: నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి

82చూసినవారు
ఉరవకొండ: నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి
రైతులకు ఇబ్బందులు కలిగించే నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ డిమాండ్ చేశారు. ఉరవకొండ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఏపీ రైతు సంఘం నాయకులు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్