నారా లోకేష్ ఇచ్చిన హామీ జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలోని టవర్ క్లాక్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహం ఎదుట వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షడు హనుమంతురాయుడు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ ట్ విడుదల చేయాలన్నారు.