అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు నివాళులు అర్పించారు. ఆదివారం ఆముదాలవలస పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆవరణలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు ఆత్మకూరి రామక్రిష్ణ, ఆముదాలవలస ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తమ్మన రామకృష్ణారావు ,బంగారు రాజు, పూసర్ల సూరి కుమారి పాల్గొన్నారు.