శ్రావణమాసం సందర్భంగా రెండో శుక్రవారం లక్ష్మీ సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆముదాలవలస వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్యనిర్వాలను అధికారి తమ్మినేని రవి పర్యవేక్షణలో ఆలయ అర్చకులు నంబాల గోపిచైతన్య స్వామి, సంతోష్ కుమార్, నేటింతి రాజేష్ ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజలు, మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు ప్రాంతాలకు చెందిన మహిళలు, భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.