పాఠశాల అభివృద్ధికి పేరెంట్స్ కమిటీ విద్యార్థులు కృషి చేయాలని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ కోరారు శనివారం ఆముదాలవలస మండలంలోని తొగరాం గ్రామంలో పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పేరెంట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు కమిటీ పాటించాలన్నారు.