తీరిన బోనగట్టు సమస్య

55చూసినవారు
తీరిన బోనగట్టు సమస్య
శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం గ్రామంలో వంశధార నది నీటి ప్రవాహం పొలాల్లోకి రాకుండా.. రైతులు నిర్మించిన బోనగట్టు యొక్క మట్టి అక్రమ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రెవెన్యూ అధికారులు పలుమార్లు పరిశీలించి నీటి ప్రవాహం పంట పొలాల్లోకి ప్రవేశించకుండా ఉండటానికి తక్షణ చర్యగా జేసీబీ సహాయంతో బోనగట్టును మరల అధికారులు నిర్మించారు. బోనగట్టు మరల నిర్మించడానికి అధికారులతో మాట్లాడి.. రైతులకు అన్ని విధాలుగా సహకరించిన ఎమ్మెల్యే గొండు శంకర్ కి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్