ఆముదాలవలస అంగన్వాడీ కేంద్రాలలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల శరీరం లోపల నులి పురుగుల నివారణకు ఈ మాత్రలు ఉపయోగపడతాయని వైద్య సిబ్బంది వివరించారు. ఆల్బెండజోల్ మాత్రలను అంగన్వాడి చిన్నారులకు స్థానిక ఐసిడిఎస్ సిబ్బంది అందించారు. శారీరక మానసిక అభివృద్ధికి, నులిపురుగుల సంక్రమణ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.