ఆముదాలవలస మండలం దూసి గ్రామ సచివాలయ ప్రాంగణంలో మంగళవారం ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనుల సామాజిక తనిఖీ 17వ సభ నిర్వహించారు. ఉపాధి హామీ పనుల ద్వారా వలసలు నివారించామని, రైతులకు ఎంతో మేలు చేకూరిందని ఉపాధి హామీ డి ఆర్ పి సిబ్బంది వెల్లడించారు. తనిఖీ చేసిన పనుల వివరాలను గ్రామ సభలో చదివి వినిపించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, వేతనదారులు పాల్గొన్నారు.