చీమలవలసలో చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట

80చూసినవారు
ఆముదాలవలస మండలం చీమల వలస ప్రభుత్వ పాఠశాల వద్ద గురువారం సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. గ్రామంలో గల శ్రీ దుర్గాదేవి పూజా కమిటీ విరాళం సేకరించి ఈ విగ్రహ ప్రతిష్ట నిర్వహించినట్లు కమిటీ సభ్యులు సూర్య చంద్ర కిరణ్ తెలిపారు. గ్రామ పురోహితులు మణికంఠ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్