ఏపీ ప్రభుత్వం ఆముదాలవలస నియోజకవర్గంలో గల కేజీబీవీ విద్యాలయాలకు నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కూన రవికుమార్ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదలైంది. ఆమదాలవలస కేజీబీవీ లకు రూ. 60. 74 లక్షలు, పొందూరు కేజీబీవీ కి రూ. 44, 30, 182, బూర్జ కేజీబీవీ కి రూ. 18. 50 లక్షలు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. వీటిని లైబ్రరీ, సైన్స్ కంప్యూటర్ ల్యాబ్ తదితర పరికరాల కోసం వినియోగిస్తారని అన్నారు