లావేరు మండలం కొత్త కుంకం గ్రామంలో రైతులకు వివిధ పంటలపై అధికారులు అవగాహన కల్పించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణ నిమిత్తం రైతులతో విషముసిడి కషాయం 180లీటర్లు తయారు చేయించారు. దీనిని వినియోగించడం వలన పెట్టుబడి ఖర్చు తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ పిడుగు సోమశేఖర్, డిజిటల్ కార్యకర్త రాంబాబు రైతులు పాల్గొన్నారు.