రైల్వేగేటు మరమ్మతు పనులు పూర్తి కావడంతో రాకపోకలకు ఇబ్బందులు తొలగాయి. శ్రీకాకుళం రోడ్ ఆముదాలవలస రైల్వే స్టేషన్ ఉత్తరం వైపున ఉన్న గేటు మరమ్మతు పనులు రెండు రోజులుగా చేస్తుండటంతో పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు, వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. శనివారం అర్ధరాత్రి వరకు సాగిన మరమ్మతు పనులు పూర్తి కావడంతో రహదారి క్లియర్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వాహనదారులు రాకపోకలు యదాతదంగా కొనసాగుతున్నాయి.