బూర్జ మండలం సింగన్నపాలెం సర్పంచ్ తులగాపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు కు తాత్కాలిక మరమ్మత్తు పనులు నిర్వహించారు. రహదారిపై ఏర్పడ్డ గుంతలలో గ్రావెల్ వేసి పూడ్చినట్లు తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో రహదారి గుంతల్లో నీరు నిల్వ ఉండి వాహనదారులకు ప్రమాదంగా మారిందని అన్నారు. ప్రమాదాల నివారణకు తాత్కాలిక మరమ్మత్తులు చేసినట్లు తెలిపారు.