దుర్వాసనకు నిలయంగా మారిన క్రీడా ప్రాంగణం

68చూసినవారు
ఆముదాలవలస జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం వద్ద ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ కంపు, దుర్వాసనకు నిలయంగా మారిందని పలువురు జిమ్ సాధకులు చింతాడ రాజీవ్, రాంబాబు తదితరులు గురువారం తెలిపారు. ఇక్కడ చెట్లు కొమ్మలపై పక్షులు గూళ్లు నిర్మించుకోవడంతో వాటి వ్యర్ధాల కారణంగా జిమ్ పరికరాలు నాశనం అవుతున్నాయని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి చెట్లు కొమ్మలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్