ఆముదాలవలస లోని వెంకయ్య పేట గ్రామంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజలు ఈ సందర్భంగా తమ గ్రామంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ను కోరారు. పాఠశాల నూతన భవనo, మురుగునీటి కాలువల నిర్మాణము, చెరువుల ఆక్రమణలు తొలగింపు, పూడిక తీత పనులు తదితర వాటిని కోరారు.