చిన్నరావుపల్లిలో ఆకట్టుకున్న చిన్నారుల కోలాటం

73చూసినవారు
చిన్నరావుపల్లిలో ఆకట్టుకున్న చిన్నారుల కోలాటం
ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శనివారం నిమజ్జన కార్యక్రమం సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలలో చిన్నారుల కోలాటం ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్