మెగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న దేరసాం జనసైనికులు

52చూసినవారు
మెగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న దేరసాం జనసైనికులు
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఈశ్వరరావు బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ రక్తదాన శిబిరానికి దేరసాం గ్రామం నుంచి జనసేన నాయకుడు దన్నాన రవీంద్ర ప్రోత్సాహంతో 30 మంది జనసైనికులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది.ఈశ్వరరావు మాట్లాడుతూ ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇంత మంది జనసైనికులు కదిలివచ్చి రక్తదానంచేసి, ప్రాణదాతలుగా మారడంతో ఆయన ఎంతో హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్