ఎచ్చెర్లలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేయటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. బాలికల విద్యకు తల్లిదండ్రుల ప్రాధాన్యమివ్వాలి సూచించారు.