ఉపాధ్యాయులు పారుపల్లి కి ఎడ్యుకేషన్ గ్లోరీ అవార్డు

80చూసినవారు
ఉపాధ్యాయులు పారుపల్లి కి ఎడ్యుకేషన్ గ్లోరీ అవార్డు
ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారుపల్లి శ్రీనివాసరావు కు విశిష్టమైన ఎడ్యుకేషన్ గ్లోరీ అవార్డు లభించింది. గురుపూజోత్సవం సందర్భంగా ది టార్గెట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ శ్రీనివాసరావు కి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. విద్యా రంగంలో అందించిన సేవలను గుర్తిస్తూ ఫౌండేషన్ చైర్మన్ ఓం ప్రకాశ్, అన్వేష్ వర్చువల్ విధానంలో గురువారం ఈ పురస్కారం అందజేశారు.

సంబంధిత పోస్ట్