ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో కార్తీక మార్గశిర పాడ్యమి సందర్భముగా గీతా పారాయణం కార్యక్రమంసోమవారం నిర్వహించారు. ఒకటో అధ్యాయం నుంచి తొమ్మిదవ అధ్యాయం వరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు రేజేటి రామారావు పంతులు తెలిపారు.ఈ కార్యక్రమంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం చేపట్టారు సుమారు 1500 మంది పైగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.