కవిటి మండల కేంద్రంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయం సన్నిధిలో హోమాలు, యజ్ఞాలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. 'హనుమాన్ చాలీసా' ముద్రించిన ఫ్రేమ్ ఆలయ కమిటీకి పట్టణానికి చెందిన 'క్రేజీ వేర్' సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఉషోదయ యువజన సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.