విశాఖ రైల్వేస్టేషన్లో సోంపేటకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే విశాఖలో కుటుంబంతో కలిసి ఎం. రాజకుమార్ జీవనం సాగించేవాడు. సంక్రాంతికి ఇంటికి వెళ్లలేకపోవడంతో గురువారం సోంపేటలోని బుసభద్ర వేళ్లేందుకు గురువారం విశాఖ రైల్వే స్టేషన్ కు వచ్చాడు. తీవ్ర అస్వస్థకు గురైన రాజకుమార్ కాలిబాట వంతెనపై నడుస్తూ కుప్పకూలిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.