ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు క్రమశిక్షణ అలవరచుకోవాలి

81చూసినవారు
నేటితరం విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే చక్కనైన క్రమశిక్షణను అలవర్చుకోవాలని నానాజీ గాడ్గే తెలిపారు. నరసన్నపేట మండలంలోని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక విద్యా భారతి గురుకుల పాఠశాలలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు కూడా ప్రాథమిక దశలోనే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే దిశగా బోధన చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్