పోలాకి మండల కేంద్రంలో జాగిలంతో ఆదివారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. స్థానిక ఎస్సై జి రంజిత్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి నియంత్రణ పట్ల చర్యలు తీసుకునే విధంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో నరసన్నపేట సీఐ జే శ్రీనివాసరావు తో కలిసి మార్కెట్ లోని పలు దుకాణాలను, పుర వీధులలో తనిఖీలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాపై దృష్టి సాధించామన్నారు.