పలాసలో పట్టపగలే దొంగతనం
శ్రీకాకుళం జిల్లా పలాసలో పట్టపగలే దొంగతనం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పలాస ఫిష్ మార్కెట్ కు ఎదురుగా ఉన్న ఇంట్లో సుడియా కళావతి అనే మహిళ నివాసం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం ఆమె భోజనం చేస్తుండగా ఓ వ్యక్తి అడ్రెస్ అడుగుతూ ఇంట్లోకి వచ్చాడు. తరువాత మహిళ మెడలో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను తెంపుకొని అక్కడి నుండి పరారైయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.