మెలియాపుట్టి మండల కేంద్రంలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం టెక్కలి డీఎస్పీ డిఆర్ఎస్ఎన్ మూర్తి వివరాలు వెల్లడించారు. మెలియాపుట్టి మండలానికి చెందిన తమ్మిరెడ్డి రవి అనే వ్యక్తి మెలియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన ఐదుగురు వ్యక్తులతో కలిసి దొంగనోట్లను ముద్రించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 57 లక్షల 25 వేల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.